జవహర్ నగర్, వెలుగు: పీహెచ్ సీల్లోని సిబ్బంది సీజనల్ వ్యాధులపై అలర్డ్ గా ఉండాలని మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ సూచించారు. మంగళవారం జవహర్ నగర్ పీహెచ్ సీ, జడ్పీ స్కూల్‌ను సందర్శించారు. ఆయుష్ విభాగం, ఎమర్జెన్సీ డ్రెస్సింగ్, ఇమ్యూనైజేషన్,ఫార్మసీ,ఆపరేషన్ థియేటర్, ఇన్ పేషెంట్ రూమ్, రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఎంతమందికి షుగర్, బీపీ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారని, స్టాక్ ఎంత అందుబాటులో ఉందని ఆరాతీశారు.
ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కుటుంబ నియంత్ర ఆపరేషన్లు చేస్తున్నారా లేదా అని, పీహెచ్ సీల్లో నార్మల్ డెలివరీ పెంచాలని పేర్కొన్నారు. బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ లే కాకుండా మరికొన్ని టెస్ట్ లను చేయడానికి ల్యాబ్ లను ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ ఓకు సూచించారు. అనంతరం జవహర్ నగర్ జడ్పీ స్కూల్ ను తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చేపట్టే నిర్మాణ పనులపై , టెన్త్ విద్యార్థులతో మాట్లాడి.. టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్ అందించారా అంటూ అడిగారు. విద్యార్థులు మంచి చదువుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం జవహర్ నగర్ లోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. జవహర్ నగర్ కార్పొరేషన్ మేయర్ శాంతి కోటేశ్ గౌడ్ , జిల్లా వైద్యాధికారి రఘునాథస్వామి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, డీడబ్ల్యుఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ సుచరిత, అధికారులు ఉన్నారు.