జూలూరుపాడు, వెలుగు : ఎప్పుడూ 108 సిబ్బంది అలర్ట్గా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమర్జెన్సీ మెడికల్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ ప్రణయ్ కుమార్ సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో 108, 102 వాహనం లోని మెడికల్ పరికారాల పనితీరును,ఎ మర్జెన్సీ మందుల కాలపరిమితిని ఆయన తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
మండలంలోని ప్రజలు108 , 102 వాహనాలను అత్యవసర సేవలకు వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఈఎంటీ రవి, పైలట్ శ్రీనివాస్ఉన్నారు.