
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో క్యాచ్ అప్ టీకాల కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ అధికారి హరీశ్ రాజ్ ప్రారంభించారు. సంజీవయ్య కాలనీలో పలువురికి టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యారోగ్యశాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం జిల్లాలో మూడు విడతల్లో తప్పిపోయిన పిల్లలకు, గర్భవతులకు వ్యాక్సినేషన్ చేస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 21 నుంచి 26 వరకు, మే నెలలో 21 నుంచి 26 వరకు, జూన్ లో 23 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శివప్రతాప్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, నాందేవ్, ఎ.శ్రీనివాస్, జగదీశ్, లక్ష్మణస్వామి, మూర్తి తదితరులు పాల్గొన్నారు.