
రాష్ట్రంలో డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులతో పాటు వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఖాళీలకు బీఎస్సీ(నర్సింగ్) లేదా జీఎన్‌ఎం కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు: మొత్తం 5,204 పోస్టులకు జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో వివరాల నమోదు చేసుకొని ఉండాలి. వయసు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసిన పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.mhsrb.telangana.gov.in వెబ్సైట్ చెక్ చేసుకోవాలి.