ములుగు, వెలుగు : ప్రజలకు వందశాతం ఆరోగ్య సేవలు అందించాలని, ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని ములుగు వైద్యాధికారి డాక్టర్ గోపాల్ రావు సూచించారు. సోమవారం ములుగు మండలం రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మల్లంపల్లి, బండారుపల్లి ఉపకేంద్రాలను డీఎంహెచ్వో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచ్సీ, ఉపకేంద్రాల్లోని సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా మాతా శిశు సంరక్షణ, పోషణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీకాంత్, రాయినిగూడెం పీహెచ్సీ అధికారి డాక్టర్ ప్రసాద్, వైద్యులు ప్రేమ్ సింగ్, శ్రావణ్, సూపర్వైజర్ దేవేందర్, హెల్త్ అసిస్టెంట్ రాజన్న, ఆరోగ్య కార్యకర్త సత్యనారాయణమ్మ, సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.