నేరేడుచర్లలో అనుమతులు లేని హాస్పిటల్స్ సీజ్

నేరేడుచర్ల, వెలుగు : పట్టణంలోని అనుమతులు లేని రెండు హాస్పిటల్స్​ను నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పున్న నాగిని సీజ్ చేశారు. గురువారం నేరేడుచర్లలో శ్రీఅమ్మ, శ్రీసాయి శ్రీనివాస హాస్పిటల్స్​ను ఆయన తనిఖీ చేసి రిజిస్టర్, ఫార్మసీ, ల్యాబ్ ను పరిశీలించారు. ఈ హాస్పిటల్స్ లో డాక్టర్స్, ఫార్మసిస్ట్ లు లేకుండా ల్యాబ్ టెక్నీషియన్స్ ఇన్ పేషెంట్లకు చికిత్స చేస్తున్నందున ఆ రెండు హాస్పిటల్స్ ను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించి, అనుమతులు తీసుకొని రోగులకు చికిత్స అందజేయాలని సూచించారు. ఆయన వెంట కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ నర్సయ్య ఉన్నారు.