
జడ్చర్ల, వెలుగు : ఎన్నికల సంఘం ఆదేశాలను జడ్చర్ల వైద్యాధికారులు బేఖాతరు చేశారు. సీఎం కేసీఆర్ బొమ్మ ఉన్న న్యూట్రిషన్ కిట్ బ్యాగులను బుధవారం జడ్చర్ల వంద పడకల ఆస్పత్రిలో గర్భిణులకు అందజేశారు. ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం సీఎం కేసీఆర్ ఫొటో కనిపించకుండా కిట్ బ్యాగులను పంపిణీ చేయాల్సి ఉండగా.. ఆఫీసర్లు నిర్లక్షంగా వ్యవహరించి అలాగే పంపిణీ చేశారు. ఈ విషయమై హాస్పిటల్ సూపరింటెండెంట్ సోమశేఖర్రెడ్డిని వివరణ కోరగా.. న్యూట్రిషన్ కిట్బ్యాగులపై ఉన్న సీఎం ఫొటోపై స్టిక్కర్ వేసి అందించామని, ఆ బ్యాగులు తీసుకున్న మహిళలు స్టిక్కర్ను తొలగించారని చెప్పారు.