హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్ టాయిలెట్‌లో గురువారం రాత్రి శిశువు డెడ్‌బాడీ కన్పించిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా వైద్యాధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. జిల్లా హాస్పిటళ్ల కోఆర్డినేటర్ చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో చందు విచారణ చేశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి, ఇతర డాక్టర్లు, సిబ్బందిని ఆరా తీశారు.
కాగా నిత్యం రద్దీగా ఉండే హుజూరాబాద్ హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ వార్డు పక్కనున్న టాయిలెట్‌లో సుమారు 7నెలల వయస్సున శిశువు డెడ్‌బాడీ కన్పించడం కలకలం రేగింది. ఇప్పటికే పోలీసులు సీసీ ఫుటేజీలు స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నారు. అయితే తమకు శిశువు డెడ్‌బాడీ ఘటనతో సంబంధం లేదని హాస్పిటల్ వర్గాలు పేర్కొంటున్నారు. పోలీసుల సమగ్ర విచారణతోనే వాస్తవం బయటకు వచ్చే అవకాశం ఉంది.