మెడికల్ ప్రొటోకాల్ పాటించాలి: హైదరాబాద్ ​కలెక్టర్ అనుదీప్

మెడికల్ ప్రొటోకాల్ పాటించాలి: హైదరాబాద్ ​కలెక్టర్ అనుదీప్

హైదరాబాద్ సిటీ/శామీర్​పేట, వెలుగు: జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్​కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‎లో 2023–-24 సంవత్సరంలోని మాతృ మరణాలపై సమీక్షించారు. ప్రతి పీహెచ్‎సీలో గర్భిణిగా నమోదైనప్పటి నుంచి ఆమెకు అందించిన వైద్య పరీక్షల వివరాలు నమోదు చేయాలన్నారు. 

వైద్యసేవలు అందించే సమయంలో మెడికల్​ప్రొటోకాల్ పాటించాలని, గర్భిణికి సీరియస్​అయితే దగ్గర్లోని పెద్దాసుపత్రికి రిఫర్ చేయాలని సూచించారు. రక్తహీనతను ముందుగా గుర్తించి అవగాహన కల్పించాల్సిన బాధ్యతపై డాక్టర్లపై ఉందన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్, డీసీహెచ్ ఎస్ రాజేంద్రనాథ్, నోడల్ అధికారులు పాల్గొన్నారు.

నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన 

శామీర్ పేట పెద్ద చెరువు వద్ద గణేశ్ నిమజ్జనాలకు చేస్తున్న ఏర్పాట్లను డీసీపీ కోటిరెడ్డితో కలిసి మేడ్చల్​జిల్లా కలెక్టర్ గౌతమ్ మంగళవారం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వారి వెంట తూంకుంట మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, శామీర్ పేట ఎంపీడీఓ మమతాబాయి, తహసీల్దార్ యాదగిరిరెడ్డి ఉన్నారు.