గోదావరిఖని, వెలుగు : సింగరేణి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న గోదావరిఖనిలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గురువారం నుంచి ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు ప్రారంభించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్‌సింగ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైద్యసేవలను ట్రాన్స్జెండర్లు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు సింగ్, డాక్టర్లు అరుణ, అప్పారావు, అర్చన, తదితరులు పాల్గొన్నారు.