రంగారెడ్డి,వెలుగు: ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు త్వర గా వైద్య సేవలు అందించాలని రంగారెడ్డి కలెక్టర్ ఆదేశించారు. వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రిని బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కలిసి పేషెంట్ల వార్డులను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు, ఆస్పత్రి పరిసరాలు పార్కింగ్ సమస్య దృష్టికి తీసుకురావడంతో వెంటనే పార్కింగ్ సమస్య పరిష్కరించాలని తహసీల్దార్ కు సూచించారు.
ఆస్పత్రిలో సీవరేజి, డ్రింకింగ్ వాటర్ సమస్యలపై వాటర్ బోర్డు అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించానలి అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. లిఫ్ట్, మరుగుదొడ్ల నిర్మాణం, అదనపు గదుల నిర్మాణం, సిటీ స్కాన్ అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్ఎంఐడీసీ అధికారులతో చర్చించామని చెప్పారు. మహేశ్వరం మెడికల్ కాలేజ్ డాక్టర్లు, ప్రొఫెసర్లు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తేగా.. వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీఎంహెచ్వో వెంకటేశ్వర రావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి జి.రాజు యాదవ్, అధికారులు ఉన్నారు.