రొంపల్లిలో అంబులెన్సులో డెలివరీ

రొంపల్లిలో అంబులెన్సులో డెలివరీ

తిర్యాణి, వెలుగు: ఓ మహిళకు సిబ్బంది అంబులెన్స్​లోనే డెలివరీ చేశారు. తిర్యాణి మండలం రొంపల్లి పంచాయతీలోని రాంజీగుడాకు చెందిన కుర్సెంగ లక్ష్మికి శనివారం పురిటినొప్పులు మొదలయ్యాయి. 108కు సమాచారం అందించగా అంబులెన్స్​ అక్కడకు చేరుకొని మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రసవమైంది. 

అంబులెన్స్​ ఈఎంటీ శ్రీకాంత్, పైలట్​ వాసుదేవులు డెలివరీ చేసి తల్లీబిడ్డను కాపాడారు. ఆ తర్వాత బెల్లంపల్లి హాస్పిటల్​లో చేర్పించగా తర్వాత పరీక్షించిన డాక్టర్లు వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.