
కౌడిపల్లి, వెలుగు: కౌడిపల్లి మండల పరిధి తునికి లోని మహాత్మా జ్యోతి బా పూలే బాలుర గురుకుల స్కూల్లో స్టూడెంట్స్కు కండ్ల కలక సోకింది. దాదాపు పది రోజులుగా స్టూడెంట్స్ కండ్ల కలకతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ వైద్య సిబ్బంది పట్టించుకోవడంలేదని పేరెంట్స్ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసి చాలా మంది గురుకులం నుంచి తమ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లారు.
ఈ విషయమై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ ను వివరణ కోరగా సమస్య ఉన్న హాస్టల్ కు వెళ్లి స్టూడెంట్స్కు పరీక్ష చేస్తున్నామని తెలిపారు. అవసరమైన మందులు ఇవ్వడంతోపాటు, జాగ్రత్తలు వివరిస్తున్నామన్నారు. కాగా 690 మంది స్టూడెంట్లకు గాను 400 మందికి కండ్ల కలక సోకినట్లు సమాచారం.