నారాయణపేట, వెలుగు; ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరిగేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం జాజాపూర్, బొమ్మన్పాడు పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. మన ఊరు, మనబడి పనులను పరిశీలించారు. అనంతరం కోటకొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అన్ని వార్డులను పర్యటించి రోగులతో మాట్లాడారు.
ఆస్పత్రిలో ఎన్ని కాన్పులు జరుగుతున్నాయో వాటి రిపోర్టులు తనకు పంపాలని సిబ్బందిని ఆదేశించారు. ఎక్కువ శాతం ఆస్పత్రుల్లోనే కాన్పులు జరిగేలా నార్మల్ డెలివరీ చేయాలన్నారు. ప్రతి బుధవారం సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, డాక్టర్ శైలజ, డాక్టర్ బాలాజీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.