రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేఎంసి పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. సీనియర్ మెడికల్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక.. ఇంజక్షన్ ద్వారా పాయిజన్ తీసుకొని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన మరవకముందే మరో మెడికో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
ఖమ్మం, మమతా మెడికల్ కాలేజీకి చెందిన సముద్రాల మానస(22) అనే మెడికో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో పెట్రోల్ పోసుకొని నిప్పటించుకుంది. మృతురాలు మానస బిడిఎస్ 4వ సంవత్సరం చదువుతోంది. ఆమె స్వస్థలం వరంగల్. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు తెలుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.