కార్పొరేట్ ఆస్పత్రిలో అపెండిక్స్ ఆపరేషన్ తర్వాత మెడికల్ స్టూడెంట్ మృతి

కార్పొరేట్ ఆస్పత్రిలో అపెండిక్స్ ఆపరేషన్ తర్వాత మెడికల్ స్టూడెంట్ మృతి

కూకట్ పల్లిలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో అపెండిక్స్ ఆపరేషన్ చేయించున్న మెడికల్ స్టూడెంట్ చనిపోయాడు. కేపి.హెచ్.బి కాలనీ లోని హోలిస్టిక్ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతోనే యువకుడు మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. కేపి.హెచ్.బిలోని 9వ ఫేజ్ లో వరుణ్ తేజ్(23) నివాసం ఉంటున్నాడు. అతను ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఎం.బి.బి.ఎస్ సెకండ్ ఈయర్ చదువుతున్నాడు. 

ALSO READ | ఉస్మానియా హాస్పిటల్ రికార్డ్.. డాక్టర్‌కే సర్జరీ : ఫ్రీగా 4 కిడ్నీ, 2 లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు

వరుణ్ తేజ్ అపెండిక్స్ బాధపడుతుండగా.. ఆపరేషన్ కోసం సెప్టెంబర్ 24న హోలిస్టిక్ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స తీసుకుంటున్న వరుణ్ తేజ్ చనిపోయాడు. అపెండిక్స్ ఆపరేషన్ చేస్తామని తీసుకొని వెళ్లి ఇప్పుడు మృతి చెందాడని చెప్పడంపై బంధువుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హాస్పిటల్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. కేపి.హెచ్.బి  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆసుపత్రి లైసెన్స్ వెంటనే రద్దు చేసి ఆపరేషన్ చేసిన వైద్యుడుని అరెస్ట్ చేయాలని బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.