వాగులో మెడికల్ స్టూడెంట్ గల్లంతు

  • విహారయాత్రకు వెళ్లిన 8 మంది రిమ్స్ పీజీ విద్యార్థులు 
  • ఆదిలాబాద్​లో ఘటన

ఆదిలాబాద్, వెలుగు: ఫ్రెండ్​షిప్​డే సందర్భంగా ఎనిమిది మంది మెడికల్​స్టూడెంట్లు విహార యాత్రకు వెళ్లగా అందులో ఒకరు గల్లంతయ్యారు. ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ఎనిమిది మంది పీజీ స్టూడెంట్లు ఫ్రెండ్​షిప్​డే సందర్భంగా ఆదిలాబాద్ మండలంలోని కుంభజారిలోని కోటిలింగాల వాగుకు వెళ్లారు. వాగులోకి వెళ్లిన స్టూడెంట్లలో పీజీ ఫస్ట్​ఇయర్​చదువుతున్న ప్రవీణ్ స్నానం చేస్తుండగా సుడిగుండంలో చిక్కుకున్నాడు. 

ఆయనను కాపాడేందుకు కార్తీక్, రాజు ప్రయత్నించగా వారు కూడా సుడిగుండంలో పడిపోయారు. దీంతో ప్రవీణ్ గల్లంతవగా మిగిలిన ఇద్దరు ఈదుకుంటూ బయటకు వచ్చారు. వీరు రిమ్స్ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ విషయం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సంఘటన స్థలానికి చేరుకొని రాత్రి వరకు గాలించినా  ప్రవీణ్​ ఆచూకీ దొరకలేదు.