
మెడికల్ స్టూడెంట్లు, ఫ్రొఫెసర్లకోసం కొత్త వాట్సాప్ ఛానల్ ను ప్రారంభించింది నేషల్ బోర్డు ఆప్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(NBEMS). ఈ ఛానల్ ద్వారా ఎగ్జామ్స్, అక్రిడిటేషన్, ట్రైనింగ్ సంబంధిత సమాచారం ఎప్పటికప్పుడు అందించనుంది.
ఈ వాట్సాప్ ఛానల్ ప్రత్యేక మెడికల్ స్టూడెంట్లు, NBEMS ట్రైనింగ్ తీసుకునేవారు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, వివిధ సంస్థల కోసం రూపొందించారు. రెగ్యులర్ కమ్యూనికేషన్, త్వరతగతిన ఇంపార్టెంట్ మేసేజ్ లు పంపించడం లక్ష్యంగా ఈ ఛానల్ పనిచేస్తుంది. NBEMS వాట్సాప్ ఛానెల్‌ని ఎలా యాక్సెస్ చేయాలంటే.. స్టూడెంట్స్, ఫ్రొఫెసర్లు NBEMS వెబ్ సైట్ ద్వారా వాట్సాప్ ఛానెల్‌ని అనుసరించవచ్చు. యూజర్లు వారి మొబైల్ పరికరాల్లో నేరుగా అప్డేట్స్ పొందవచ్చు. షేర్ చేయబడిన సమాచారాన్ని అధికారిక NBEMS వెబ్‌సైట్ ద్వారా కూడా నిర్ధారించుకోవచ్చు.
►ALSO READ | హైదరాబాద్ ఉప్పల్ స్టేడియాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్