- ఫిజియోథెరపీ చదివి డాక్టర్గా ప్రాక్టీస్
- వరంగల్ సిటీలో పట్టుబడిన నిందితుడు
వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ సిటీ కరీమాబాద్ లో మంగళవారం సాయంత్రం జిల్లా మెడికల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టగా..ఫేక్ డాక్టర్ ఎ. దిలీప్ పట్టుబడ్డాడు. ఫిజియోథెరపీ చదివి..డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నట్టు గుర్తించారు.
అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ. 3 వేల విలువైన మెడిసిన్ ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా క్లినిక్ ఏర్పాటు చేసి యాంటీ బయోటిక్ , స్టెరాయిడ్, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ పేషెంట్లకు ఇస్తున్నట్టు తేలింది.
ALSO READ : గిఫ్ట్ ల పేరుతో స్టూడెంట్ను మోసం చేసిన సైబర్ చీటర్స్
డాక్టర్ నంటూ ప్రిస్క్రిప్షన్ రాస్తున్నట్లు టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ నరేశ్ కుమార్ తెలిపారు. ఫేక్ డాక్టర్ పై కేసు నమోదు చేయనున్నట్లు వరంగల్ డ్రగ్ ఇన్ స్పెక్టర్ అరవింద్ కుమార్ చెప్పారు.