చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని నంద్యాలోని ఆర్.కె.ఫంక్షన్ హాల్ వద్ద ఆయన బస చేసిన బస్సు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును అరెస్టు చేస్తున్నట్లు సీఐడీ పోలీసులు తెలిపారు.
చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత సీఐడీ పోలీసుల ఆధ్వర్యంలో డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల్లో చంద్రబాబుకు హైబీపీ, షుగర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబు తరఫు న్యాయవాది తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని..అందుకు మెరుగైన వైద్య చికిత్స కోసం చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్‌కు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్నారు సీఐడీ పోలీసులు. టిఫిన్ చేసిన తర్వాత ఆయన్ను తన కాన్వాయ్‌లోనే ఎన్‌ఎస్‌జీ భద్రతతో విజయవాడకు తరలించనున్నారు. ఇప్పటికే అరెస్టుకు సంబంధించిన పత్రాలపై చంద్రబాబు సంతకం చేశారు.
ఏపీ స్కిల్ డెవలప్‍మెంట్ అవినీతి కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. CRPC సెక్షన్ 50(1) కింద చంద్రబాబుకు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, red with 34 and 37 ipc సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.