వరంగల్ రూరల్ : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మందుల దందా నిజమేనని.. జిల్లా వినియోగదారుల మండలి రాష్ట్ర అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి తేల్చి చెప్పారు . మూడేళ్లలో అవసరం లేని సర్జికల్ కిట్లు ఇండెంట్ పెట్టి తెప్పించడం వల్ల రూ.13.22 కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైనట్లు తెలిపారు. హాస్పిటల్‌లో మందుల స్కామ్ జరిగిన నేపథ్యం లో.. సర్జికల్ కిట్ల కొనుగోలు, ఇతర
వివరాల సమాచారం కావాలని మండలి ఆధ్వర్యంలో సభ్యులు ఆర్టీఐ ద్వారా అడిగారు. కాగా, అవి ఇవ్వడం ఇష్టంలే ని అధికారులు.. తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. సమాచారం 12,500 కాపీల్లో ఉందని, ఒక్కో కాపీ జిరాక్స్ కోసం రూ. 25వేలు చెల్లించాలని సమాధానమిచ్చారు. తాము అడిగిన ఇన్‍ఫర్మేషన్ ఇవ్వాలని, లేదంటే నేరుగా రికార్డులు చూడటానికి అనుమతి ఇప్పించాలని మండలి సభ్యులు ఎంజీఎం సూపరింటెండెంట్‍కు డిసెం బర్ 13న ఫస్ట్ అప్పీల్ చేశారు. పది రోజుల తరువాత అనుమతివ్వడంతో సోమవారం మండలి రాష్ట్ర కమిటీ రికార్డులు పరిశీలించింది.
అవసరమైన మందులు రావట్లేదు..
కమీషన్ల కోసం అవసరంలేని సర్జికల్ కిట్లు కొంటున్న ఆఫీసర్లు పేషంట్లకు అవసరమయ్యే మందులు మాత్రం తీసుకురావడం లేదన్నారు .ఎక్కువగా అవసరముండే ఐవీ సెట్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్, పాంటా ప్రోజల్, బీ కాంప్లెక్స్, పారాసెటమల్, యాంటీ రెబీస్ వంటి మందులు రెగ్యూలర్ గా కొనడం లేదన్నారు . మందుల దందాపై వార్తలు రావడంతో అసలు దోషులను వదిలేసి..చర్యల పేరుతో ఓ ఫార్మసిస్టును సస్పెండ్ చేశారని ఆరోపించారు. విచారణ అనంతరం ఇదే విషయాన్న ఎంజీఎం సూపరిం టెడెంట్ శ్రీనివాస్‍కు వివరిం చా-మన్నారు . రికార్డుల పరిశీలనలో.. బొక్క భాస్కర్, కొల్లోజు వెంకటేశ్వర్లు, పెం దోట అనిల్ తో పాటు
ఎంజీఎం ఫార్మసీ సూపర్ వైజర్ టీఎన్ స్వామి, ఆర్టీఐ ఇన్‌చార్జ్ సత్యనారా యణ, మండలి సభ్యులు వంగరి భాస్కర్, తోట రాంబాబు పాల్గొన్నారు . ఎంజీఎంలో మెడిసిన్, సర్జికల్ కిట్ల కొనుగోళ్లలో కోట్ల రూపాయల అక్రమాలపై మందుల దందా పేరిట వెలుగు పత్రికలో ఇటీవల కథనం ప్రచురితమైంది.
రికార్డులు మాయం చేశారు
ఎంజీఎంలో 2016 నుం చి 2019 వరకు రూ.13.22 కోట్ల మందులు, సర్జికల్ కిట్లకు సంబంధించి రికార్డులను అధికారులు మాయం చేసినట్లు చక్రపాణి తెలిపారు. తీసుకొచ్చిన మందుల్లో ఈ ఏడాది ఏప్రిల్ లో కొన్ని మందులు ఎక్స్‌పైరీ అవ్వగా.. మరో ఆరు నెలల్లో దాదాపు రూ.3 కోట్ల విలువ చేసే మందులకు కాలం చెల్లనున్నట్లు పేర్కొన్నారు . ఎంజీఎంలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెం దిన రూ.6.22 కోట్ల మందులు స్టోర్ రూమ్ లోనే మూలుగుతున్నాయన్నారు.