- గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ లో మందుల కొరత
- డాక్టర్లు రాసిస్తున్న మందుల్లో సగం కూడా ఉండట్లేదు
- ప్రైవేట్మెడికల్షాపులను ఆశ్రయిస్తున్న పేషెంట్లు
- ‘గాంధీ’ ఓపీలో పనిచేయని ఈసీజీ మెషీన్
హైదరాబాద్/పద్మారావునగర్, వెలుగు : సిటీలోని ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత వేధిస్తోంది. పేదోడి హాస్పిటల్స్‌గా చెప్పుకునే గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ లోనూ పూర్తిస్థాయిలో మందులు దొరకట్లేదు. డాక్టర్రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌తో హాస్పిటల్ఫార్మసీకి వెళ్తే.. మందులు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌కు రోజూ గ్రేటర్సిటీతోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి చికిత్స కోసం పేదలు వస్తుంటారు. వారందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్, టెస్టులు చేస్తున్నప్పటికీ మందులు దొరకడం లేదు. సగానికి పైగా ప్రైవేట్మెడికల్షాపుల్లో కొనుక్కుంటున్నారు. గంటల కొద్ది కూలైన్లలో నిలబడిన పేషెంట్లు అన్ని రకాల మందులు లేవని తెలుసుకుని ఉసూరుమంటున్నారు. చేసేదేమీ లేక బయటి షాపుల్లో కొనుక్కుంటున్నారు.
పైగా డాక్టర్లు 10 రోజులకు మందులు రాస్తే.. హాస్పిటల్ఫార్మసీల్లోని సిబ్బంది ఐదు రోజులకే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. చాలా రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోడం లేదని పేషెంట్లు ఆరోపిస్తున్నారు. ఇక గాంధీ హాస్పిటల్ అవుట్పేషెంట్విభాగంలో సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఉన్న ఏకైక ఈసీజీ మిషన్పనిచేయడం లేదు. యాజమాన్యాన్ని అడిగితే ఈసీజీ మెషీన్‌ను రిపేర్‌కు పంపామని చెబుతున్నారు. దీంతో అవుట్పేషెంట్లకు ఈసీజీ సేవలు అందడం లేదు.
ప్రైవేట్ మెడికల్ హాల్స్ ఫుల్
గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఫార్మసీలు ఉన్నప్పటికీ పేషెంట్లకు మందులు దొరకడం లేదు. ఇవే హాస్సిటల్స్ఆవరణలో, బయట ఉన్న ప్రైవేట్మెడికల్షాపులు మాత్రం రోజంతా పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఫార్మసీలో దొరకని మందులకు వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. గాంధీ హాస్పిటల్ప్రభుత్వ ఫార్మసీకి కొంతకాలంగా పూర్తి స్థాయిలో డ్రగ్స్ స్టోర్ నుంచి మందులు రావడం లేదని తెలిసింది. చాలా మంది పేషెంట్లు రెగ్యులర్‌గా వినియోగించే పాంటో ప్రజోల్టాబ్లెట్ల స్టాక్సరిపడా ఉండట్లేదు. డైక్లోఫెనిక్ జెల్తదితర మందుల కొరత ఎక్కువగా ఉంది. ఉస్మానియాకు వచ్చే పేషెంట్లు గుండె సంబంధిత సమస్యలు, ఎలర్జీ, షుగర్ సమస్యలకు బయటి మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేస్తున్నారు.
సరిపడా మందులు ఇవ్వట్లేదు
మా బంధువుకు ఆరోగ్యం బాగోలేకపోతే గాంధీ హాస్పిటల్ కు తీసుకొచ్చాను. గుండెలో నొప్పిగా ఉండడంతో డాక్టర్లు ఈసీజీ తీయాలి అన్నారు. కానీ ఇక్కడ ఈసీజీ మెషీన్లేదు. చేసేదేమీ లేక తిరిగి వెళ్తున్నాం. ఫార్మసీలో మందులు కూడా పూర్తిగా ఇవ్వలేదు.
– కార్తిక్, పేషెంట్ అటెండర్, అల్వాల్
నెల రోజులకు రాస్తే..10 రోజులకు ఇచ్చారు
ఆరోగ్యం బాగోలేకపోతే ఉస్మానియా హాస్పిటల్‌కు వచ్చాను. డాక్టర్నెలరోజులకు మందులు రాశారు. ఫార్మసీలో మాత్రం 10 రోజులకే ఇచ్చారు. డాక్టర్రాసిన అన్ని రకాలు ఇవ్వలేదు. సగమే ఇచ్చారు. మిగతా మందులు లేవని చెప్పారు. బయటి షాపుల్లో తీసుకోమన్నారు.
– హసీనా బేగం, చార్మినార్
ప్రైవేట్ షాపులు లేకుండా చూడాలి
ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత వైద్యం అందించాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెస్టులు మాత్రమే ఫ్రీగా చేస్తున్నారు. మందులు సరిపడా ఇవ్వట్లేదు. ప్రభుత్వ హాస్పిటల్స్ కు వచ్చే పేద పేషెంట్లను ప్రైవేట్షాపులకు వెళ్లేలా చేస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ఆవరణలో ప్రైవేట్ మెడికల్ షాపులు లేకుండా చూడాలి. కానీ, ప్రభుత్వమే వేలం వేసి మెడికల్‌షాపులను ప్రోత్సహిస్తోంది. హాస్పిటల్స్ఆవరణలోని మెడికల్ షాపులను తొలగించాలని ఇటీవల సీఎంకు లెటర్రాశాం. స్టాక్ అయిపోగానే మందులు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్గుడ్ గవర్నెన్స్