మెడికల్​ ప్రిస్కిప్షన్​: మందుల చీటి రాశాడు.. డాక్టర్​కి నోటీసు వచ్చింది...

మధ్యప్రదేశ్​లో ఓ  డాక్టర్​ కు మెడికల్​ బోర్టు నోటీసు ఇచ్చింది.  ఓ రోగికి అతను రాసిన మందుల చీటి రాశి నోటీసు అందుకున్నాడు.  సాధారణంగా వైద్యులు రాసే మెడికల్​ ప్రిస్కిప్షన్​.. మందుల షాపుల వారికి.. నర్శింగ్​ కోర్సు చేసిన వారికి.. బీఫాంసీ చదివిన వారికి మాత్రమే అర్దమవుతాయి.  సామాన్యులకు అర్దం కావు.  ఒకవేళ ఒకటి రెండు అక్షరాల అర్దమైనా.. దానిని ఎలా చదవాలో కూడా తెలియదు.  కాని ఓ డాక్టర్​ రాసిన మందుల చీటి మెడికల్ స్టోర్ల వ్యక్తులు, పాథాలజీ వ్యక్తులకు కూడా అర్దం కాలేదు.  ఆయన ఏమందులు రాశాడో కూడా తెలియకపోవడంతో.. ఈ ప్రిస్కిప్షన్​ సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో..ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డ్యూటీ డాక్టర్‌కు నోటీసులు జారీ చేసి సమాధానం ఇవ్వాలని కోరారు. ఇకపూర్తి వివరాల్లోకి వెళ్తే..

 మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నాలో, సోషల్ మీడియాలో ఒక మందు ప్రిస్క్రిప్షన్ వైరల్ అయిన తర్వాత వార్తల్లో నిలిచింది.  ఓ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్‌ లో వెలుగు చూసింది.   నాగౌడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ OPD నుంచి ఓ మెడికల్​ప్రిస్కిప్షన్​ వెలువడింది.  అయితే, డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌పై అందరికీ అర్థం కాని విషయం రాశాడు. ఇప్పుడు దీనికి సంబంధించి వైద్యుడికి నోటీసు జారీ చేసింది.వాస్తవానికి, జిల్లాలోని రహిక్వారా నివాసి అరవింద్ కుమార్ సేన్ శరీర నొప్పి, జ్వరంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చేరుకున్నారు.

రోగి ఓపీడీలోని డ్యూటీ డాక్టర్‌ను సంప్రదించాడు. దానిపై డాక్టర్ ఇలా ప్రిస్క్రిప్షన్ రాసి ఉండడంతో మెడికల్ స్టోర్ యాజమాన్యమే కాకుండా ఇతర వైద్యులు కూడా ప్రిస్క్రిప్షన్ చదవలేకపోయారు. అప్పుడు ఈ కరపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హెడ్‌లైన్స్‌ గా మారింది. ఇప్పుడు సాత్నా CMHO ఈ మొత్తం విషయాన్ని గ్రహించి.. ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డ్యూటీ డాక్టర్‌కు నోటీసులు జారీ చేసి సమాధానం ఇవ్వాలని కోరారు. 

సాధారణంగాడాక్టర్ల ప్రిస్క్రిప్షన్ రాయడం మనమందరం చూసే ఉంటాము. అయితే అవి కేవలం మెడికల్ స్టోర్ల వ్యక్తులు, పాథాలజీ వ్యక్తులు మాత్రమే ప్రిస్క్రిప్షన్ లెటర్‌పై వ్రాసిన మందులను.. అలాగే వాటిలో రాసిన పరీక్షల పేర్లను అర్థం చేసుకోగలరు. కాని ఈ డాక్టర్​ రాసిన మందుల చీటి ఎవరికి అర్దంకాకపోవడంతో సంజాయిషీ ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది.