
కరీంనగర్ టౌన్, వెలుగు: సిటీలోని అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ , పీజీ కాలేజీలో శనివారం మెడికో హెల్త్ కేర్ సొల్యూషన్స్ కంపెనీ నిర్వహించిన జాబ్ మేళాలో 100 మంది పాల్గొనగా 14మంది జాబ్స్ సాధించారని కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి తెలిపారు. కాలేజిలో టీచింగ్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్థమెటిక్, రీజనింగ్, వర్భల్ ఎబిలిటీ పర్సనాలిటీ డెవలప్ మెంట్ లో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్, లెక్చరర్లు, స్టూడెంట్లు, కంపెనీ ప్రతినిధులు ఇందర్జిత్ సింగ్, సచిన్, అభిలాష్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.