మెడికో ప్రీతి కేసు : సైఫ్ కస్టడీని పొడిగించాలన్న పోలీసులు.. నిరాకరించిన జడ్జి

వరంగల్ లో మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సైఫ్ పోలీస్ కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు అతన్ని వరంగల్ జిల్లా కోర్టులో హాజరు పర్చారు. ఇప్పటికే నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీలో సైఫ్ ను విచారించిన పోలీసులు.. మరో రెండు రోజుల పాటు రిమాండ్ ను పొడిగించాలని కోర్టును కోరారు. పోలీసుల నిర్ణయాన్ని జడ్జి నిరాకరించడంతో విచారణ రేపటికి వాయిదా వేశారు. అనంతరం పోలీసులు సైఫ్ ను ఖమ్మం జైలుకు తీసుకెళ్లారు. అంతకుముందు ప్రీతిది హత్యేనని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో సైఫ్ ను పోలీస్ కస్టడీకి ఇస్తూ.. కోర్టు అనుమతించింది. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా.. నాలుగు రోజుల కస్టడీకి కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది.