హుజూరాబాద్ రూరల్, వెలుగు : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాక గ్రామానికి చెందిన మెడికో రిచిత జార్జియా దేశంలో శుక్రవారం అర్ధరాత్రి చనిపోయింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. జూపాక గ్రామానికి చెందిన పంజాల కవిత, రాజు దంపతులకు కుమారుడితోపాటు కుమార్తె రిచిత (20) ఉన్నారు. రిచిత ఎంబీబీఎస్ చదివేందుకు రెండేళ్ల కింద జార్జియా వెళ్లింది.
ఈ క్రమంలో వారం కింద జ్వరంతో హాస్పిటల్‌కు వెళ్లగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి సోకిందని డాక్టర్లు నిర్ధారించారు. అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి చనిపోయినట్లు అక్కడి విద్యార్థులు తెలిపారు.
రిచిత హఠాన్మరణ వార్తతో జూపాక గ్రామంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా రిచిత డెడ్‌బాడీ స్వగ్రామానికి రావడానికి నాలుగు రోజులు పట్టనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.