
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పీజీ సెకండియర్ స్టూడెంట్ లాస్య అనే విద్యార్థిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతానికి లాస్యకు ఎంజీఎం హాస్పిటల్ లో రహస్యంగా చికిత్స అందిస్తున్నారు. ట్రీట్ మెంట్ కు సంబంధించిన వివరాలు బయటకు రాకుండా చూస్తున్నారు అధికారులు. ప్రీతి ఆత్మహత్య తర్వాత లాస్య ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో మిగతా విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి:ఐదేళ్ల వయస్సులోనే మొబైల్ కు బానిస.. నిద్రలోనూ వీడియోలు స్క్రోల్ చేస్తూ..
అయితే లాస్యది ఆత్మహత్యాయత్నం కాదంటున్నారు డాక్టర్లు. లాస్యకు మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉందని నైట్ డ్యూటీ చేయడంతో పని ఒత్తిడి వల్ల తీసుకోవాల్సిన డోసు కంటే ఎక్కువ తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. ప్రస్తుతం లాస్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు డాక్టర్లు. లాస్యది హైదరాబాద్ అని వారి తల్లిదండ్రులు రిటైర్డ్ ఉద్యోగులని చెప్పారు.