దవాఖాన్లలో భద్రత పెంచండి ..మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మెడికోల విజ్ఞప్తి

దవాఖాన్లలో భద్రత పెంచండి ..మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మెడికోల విజ్ఞప్తి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా ఘటన నేపథ్యంలో తెలంగాణలోని ప్రభుత్వ దవాఖాన్లు, మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలు, హాస్టళ్లలో మహిళా డాక్టర్లు, మెడికోలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్ (జూడా) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం -జూడా ప్రతినిధి డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్రిక నేతృత్వంలో మెడికోలు,  తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదను కలిసి వినతి పత్రం అందజేశారు. రెసిడెంట్ డాక్టర్లు, మెడికోలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమెకు వివరించారు. హాస్పిటళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో మెడికోలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమెను కోరారు. రెస్ట్ రూమ్స్, టాయిలెట్స్, పోలీసుల కాపలా, సీసీటీవీ పర్యవేక్షణ తదితర ఏర్పాట్లన్ని ఉండాలన్నారు. 

అలారం ఫీచర్ తో కూడిన ప్రత్యేక మొబైల్ యాప్ ను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పని చేసే మహిళలందరికీ తప్పనిసరి చేయాలన్నారు. ఈ యాప్ ను స్థానిక పోలీస్ స్టేషన్లు, కంట్రోల్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు కనెక్ట్ చేయాలన్నారు. 

అన్ని హాస్పిటళ్ల ఎంట్రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వద్ద బ్రీత్ ఎనలైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టెస్టులు చేసిన తర్వాతే, లోపలికి అనుమతించేలా నిబంధనలు తీసుకురావాలన్నారు. అన్ని ప్రధాన హాస్పిటళ్లలో పోలీస్ అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. డాక్టర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శారద మెడికోలకు హామీ ఇచ్చారు.