77 ఏండ్ల వ్యక్తికి గుండె ఆపరేషన్​ సక్సెస్

77 ఏండ్ల వ్యక్తికి గుండె ఆపరేషన్​ సక్సెస్
  • రోగి ప్రాణాలు కాపాడిన మెడికవర్​ డాక్టర్లు

హనుమకొండ, వెలుగు: గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న 77 ఏండ్ల రోగికి ఆపరేషన్​ చేసి, ప్రాణాలు కాపాడినట్లు మెడికవర్​ హాస్పిటల్స్ కార్డియాలజీ విభాగం డాక్టర్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా.​షఫీ పాలగిరి వెల్లడించారు. ఈ మేరకు హాస్పిటల్​లో శుక్రవారం ఆపరేషన్​ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 77 ఏండ్ల మామిడపల్లి ముకుందాచారి తీవ్రమైన గుండెపోటుతో మెడికవర్​ హాస్పిటల్​కు వచ్చాడన్నారు. అతడికి తీవ్ర ఇన్ఫీరియర్ మయోకార్డియల్ ఇన్​ఫార్​క్షన్, లెఫ్ట్ వెంట్రిక్కులర్ ఫెయిల్యూర్,  కార్డియోజెనిక్ షాక్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. 

అంతకుముందు ఇతర హాస్పిటల్స్​లో చూపించుకున్నా ఫలితం లేకపోవడంతో సీనియర్ ఇంటర్వెక్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ షఫీ, డాక్టర్ శ్రవణ్ రాంపెల్లి ఇతర నిపుణుల బృందం శ్రమించి, ముకుందాచారికి ఆపరేషన్​ చేశారు. మార్చి 7 నుంచి  31 తేదీ వరకు ట్రీట్​మెంట్​ అనంతరం ముకుందాచారిని ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేశారు. రోగికి వయోభారం, పునరావృత కార్డియాక్ అరెస్టుల కారణంగా డాక్టర్లకు పెద్ద సవాల్​గా మారగా, మెడికవర్​ హాస్పిటల్​లోని అత్యాధునిక సదుపాయాలతో ఆపరేషన్​సక్సెస్​ చేసినట్లు డా.షఫీ పాలగిరి వివరించారు.