
హనుమకొండ, వెలుగు: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక హెల్త్ చెక్ అప్ ప్యాకేజీని అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకువచ్చినట్టు హనుమకొండలోని మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్లు తెలిపారు. రూ.21,080 విలువైన ఆరోగ్య పరీక్షలు కేవలం రూ.2,025 కే అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్పెషల్ హెల్త్ చెకప్ ప్యాకేజీని సోమవారం విడుదల చేశారు. డాక్టర్లు మాట్లాడుతూ గాడితప్పిన జీవనశైలి, అదుపుతప్పిన ఆహారపు అలవాట్లతో ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు.
మెడికవర్లో అందిస్తున్న స్పెషల్ ప్యాకేజీని వినియోగించుకోవాలని సూచించారు. మెడికవర్డాక్టర్లు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ రాంపల్లి శ్రావణ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ డాక్టర్ రత్న కార్తీక్ రెడ్డి, కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ పూర్ణచంద్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ అముతుల్ హఫ్సా, కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ అరుణ్ కుమార్ దర్నా, సెంటర్ హెడ్ నమ్రత పాల్గొన్నారు.