మేడిగడ్డ బ్యారేజ్ మట్టి, మెటీరియల్ టెస్ట్ చేసిన టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్

మేడిగడ్డ బ్యారేజ్ మట్టి, మెటీరియల్ టెస్ట్ చేసిన టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:  కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‪ని సెంట్రల్ సాయిల్ మెటిరియర్ రీసెర్చ్ నిపుణుల బృందం బుధవారం పర్యవేక్షించింది. సాంకేతిక నిపుణులు బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి భూ భౌతిక, మృత్తిక, భూ సాంకేతిక పరీక్షలు నిర్వహించి పరీక్షించారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో ఉపయోగించిన మెటిరియల్, అక్కడి మట్టి నమునాలను సీఎస్ఎంఆర్ఎస్ బృందం సేకరించింది. బ్యారేజ్ కుంగిన 12, 13 పియర్ల దగ్గర 25 ఫీట్ల మేరకు తవ్వి చేసి పరీక్షలు చేస్తున్నారు. పిల్లర్లు కుంగిపోవడానికి గల కారణాలు ఏంటి అని టెస్టులు చేస్తున్నారు. మేడిగడ్డ నిర్మాణానికి ఉపమోగించిన  కాంక్రీట్ ను కూడా టెస్ట్ చేస్తున్నారు.