కేసీఆర్​ను బద్నాం చేయడానికే మేడిగడ్డను వాడుకున్నరు

కేసీఆర్​ను బద్నాం చేయడానికే మేడిగడ్డను వాడుకున్నరు
  • కాళేశ్వరం బిల్లులు ఎందుకు చెల్లించినట్లు? : ఎమ్మెల్సీ కవిత
  • రీ సర్వేకు ముందు భూముల వివరాలపై శ్వేతపత్రం ఇవ్వాలి
  • జిల్లాలో బీజేపీ ఎంపీతో పాటు
  • ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా లేనట్టే 

నిజామాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని లొల్లి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల బిల్లులు ఎందుకు చెల్లించిందో చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కేసీఆర్ స్టార్ట్ చేసిన కాళేశ్వరంపై బేషజాలకు పోకుండా వెంటనే పూర్తి చేయాలని కోరారు. సోమవారం ఆమె ఇందూర్​సిటీ బీఆర్ఎస్ ఆఫీస్​లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్​ను బద్నాం చేయడానికే మేడిగడ్డను వాడుకొని, నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టును ఎండబెట్టారని ధ్వజమెత్తారు. భూ భారతిలో ఒకరి పేరిట ఉన్న భూమి మరొకరి పేరున రాయరనే గ్యారంటీ లేదన్నారు. రీ సర్వేకు ముందే ఇప్పుడున్న భూముల వివరాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్నారు. 

రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, కిడ్నాప్ లు పెరిగిపోతున్నట్టు పోలీసు శాఖ లెక్కలు చెబుతున్నాయన్నారు. షీటీంలను ప్రభుత్వం గాలి కొదిలేసిందని, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నమ్మించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. జిల్లాలో బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలకు పవర్​లేదని,  ఓడిన కాంగ్రెస్​అభ్యర్థులే అఫీషియల్​ప్రోగ్రామ్స్​కు అటెండ్ ​అవుతున్నారని ఆమె కామెంట్​చేశారు. బీజేపీ ఎంపీ అర్వింద్​ ఉన్నా లేనట్టేనన్నారు. నిజాంషుగర్స్​ ఫ్యాక్టరీ రీ ఓపెనింగ్​ను సాగదీస్తున్నారన్నారు. హైడ్రా తరహాలో నిజామాబాద్​కు నిడ్రా తెస్తామని   పీసీసీ ప్రెసిడెంట్​మహేశ్​గౌడ్​ ప్రకటనను ఆమె తప్పుబట్టారు. బుల్డోజర్లతో ప్రజల ఆస్తులను కూలగొడితే తాము ఊరుబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మేయర్​ నీతూ కిరణ్​, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​, మాజీ జడ్పీ చైర్మన్​ విఠల్​రావు ఉన్నారు.