చొప్పదండి, వెలుగు: చొప్పదండి మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్గుర్రం నీరజ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కౌన్సిల్ మీటింగ్‌కు ఎమ్మెల్యే హాజరయ్యారు. పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు.
టౌన్‌ప్లానింగ్, అకౌంటింగ్ విభాగంలో పూర్తిస్థాయి సిబ్బంది లేక పనులు ఆలస్యం అవుతున్నాయని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. డబుల్‌బెడ్ రూమ్ నిర్మాణాల ప్రగతిని తహసీల్దార్‌ను అడిగి తెలుసుకొని కాంట్రాక్టర్‌తో మాట్లాడి మిగతా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్ శాంతి కుమార్, వైస్ చైర్మన్ విజయలక్ష్మి, కౌన్సిలర్లు, మేనేజర్ ప్రశాంత్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.