గంగాధర, వెలుగు: అవినీతికి తావివ్వకుండా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఆదివారం గంగాధర సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కామన్ సర్వీస్ సెంటర్, నారాయణపూర్‌లో కొత్తగా నిర్మించిన యాదవ , మహిళా సంఘ, గౌడ సంఘ భవనాలను ప్రారంభించారు.
అనంతరం మల్లాపూర్లో హైమాస్ట్లైట్లు, రంగారావుపల్లిలో వైకుంఠధామం, రెడ్డి సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఆయన వెంట గంగాధర్ ప్యాక్స్చైర్మన్ బాలాగౌడ్, జడ్పీటీసీ పుల్కం అనురాధ-, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.