కొండగట్టుకు రూ.100 కోట్లు ఇవ్వండి : మేడిపల్లి సత్యం 

కొండగట్టు, గంగాధర వెలుగు: కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులు కేటాయించి విడుదల చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం అసెంబ్లీలో  గళమెత్తారు.  ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత  మొదటిసారి నియోజకవర్గంలోని పలు సమస్యలను ప్రస్తావిస్తూ సభ దృష్టికి తీసుకువచ్చారు.

 ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న లెదర్ పార్క్ ను నిర్మించాలని.. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారిని ఆదుకోవాలని నారాయణపూర్ రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలను పూర్తి చేయాలని కోరారు.  మండలంలోని నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నిధులు కేటాయించాలని కోరారు.  గంగాధర మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని సీఎంకు అసెంబ్లీలోని తన చాంబర్​లో వినతిపత్రం అందజేశారు.