- సారంగాపూర్ కు అబ్దుల్ హాది
నిర్మల్, వెలుగు : నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మేడిపల్లి (సోమ) భీంరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వైస్ చైర్మన్ గా ఈటల శ్రీనివాస్, డైరెక్టర్లుగా జి.గజేందర్, జి.గంగారాం, కె.రాజారెడ్డి, వంజరి రూప, ఎంఏ అజీమ్, సి.మురళి, పి.వంశీకృష్ణ, నిమ్మ సాయన్న, ఆర్.వెంకటేశ్, సుంకరి సురేశ్, సయ్యద్ ఖలీల్ నియమితులయ్యారు.
అలాగే సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అబ్దుల్ హాదిని నియమించారు. వైస్ చైర్మన్ గా లక్కాడి శంకర్ రెడ్డి, డైరెక్టర్లుగా అంగు ముత్యం, సుభాష్ రెడ్డి, సాద ప్రశాంత్, రాథోడ్ పుష్ప, కొత్తకాపు పోతారెడ్డి, నేరేడుగొండ శ్రీనివాస్, తాటి మహిపాల్, శీల సాయినాథ్, మహమ్మద్ ముక్త్యార్, ఆత్రం నాగారావు నియామకం పొందారు.
నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన భీమ్ రెడ్డి గతంలో మేడిపల్లి గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన అబ్దుల్ హాది డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరి రావుకు అత్యంత సన్నిహితుడు.