లాంగ్ డ్రైవ్ కార్స్ దారుణాలు...11మంది ఉద్యోగులను నిర్భంధించి దాడి

లాంగ్ డ్రైవ్ కార్స్ దారుణాలు...11మంది ఉద్యోగులను నిర్భంధించి దాడి

లాంగ్ డ్రైవ్ కార్స్ యాజమాన్యం దాడి కేసులో కొత్త కోణం బయటపడింది. 11 మంది ఉద్యోగులను నిర్భంధించి వారిపై యాజమాన్యం విచక్షణా రహితంగా దాడి చేసింది.  తమ సంస్థలో పనిచేసి కొత్తగా స్టార్టప్ పెడుతున్నారనే కోపంతో లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకులు.. గత ఉద్యోగులపై దాడి చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. 

ఈ విషయాలు బయటకు చెబితే చంపుతామని బెదిరించినట్లు బాధితులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఉన్నతాదికారులు.. సమగ్ర విచారణకు ఆదేశించారు. దాడికి గురైన ఉద్యోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ పలువురు ఉద్యోగుల ఆచూకి తెలియనట్లు సమాచారం.