ప్రభుత్వ ఉద్యోగం అంటూ ఫ్రెండ్‌‌‌‌నే మోసం చేసిన్రు

మేడిపల్లి, వెలుగు : తమకున్న రాజకీయ పలుకుబడితో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం చేసిన ముగ్గురిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌‌‌‌ నగర శివార్లలోని మేడిపల్లి విహారిక కాలనీకి చెందిన మావురపు గోపాల్‌‌‌‌కు వనస్థలిపురానికి చెందిన బూసి ప్రవీణ్‌‌‌‌రెడ్డి, సాయి, శాలిబండకు చెందిన కిరణ్‌‌‌‌ కుమార్‌‌‌‌రెడ్డి, ఈసీఎల్‌‌‌‌కు చెందిన వంచ ప్రవీణ్, వేణు, సంజీవులు ఫ్రెండ్స్‌‌‌‌. తమకు రాజకీయ నేతలతో పరిచయాలు ఉన్నాయని, గోపాల్‌‌‌‌ భార్యకు రెవెన్యూ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో జూనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. 

కొన్ని రోజుల తర్వాత అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌ లెటర్‌‌‌‌ సృష్టించి, దానిని గోపాల్‌‌‌‌కు ఇచ్చి రూ. 8 లక్షలు తీసుకున్నారు. అయితే అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌ లెటర్‌‌‌‌ ఫేక్‌‌‌‌ అని గుర్తించిన గోపాల్‌‌‌‌ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేపట్టారు. నిందితుల్లో భూస ప్రవీణ్‌‌‌‌, కిరణ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి వంచ ప్రవీణ్‌‌‌‌ బుధవారం పీర్జాదిగూడ కమాన్‌‌‌‌ వద్ద ఉన్నారని తెలుసుకొని పోలీసులు అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి ఒక కారు, మూడు సెల్‌‌‌‌ఫోన్లు, ఫేక్‌‌‌‌ అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ను స్వాధీనం చేసుకొని, వారిని రిమాండ్‌‌‌‌కు తరలించారు.