గంగాధర, వెలుగు : ముంపు గ్రామాల సమస్యలను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం ఆరోపించారు. మంగళవారం గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నారాయణపూర్ రిజర్వాయర్ముంపు గ్రామమైన మంగపేటకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం కేసీఆర్నెరవేర్చలేదన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని, గెలిచిన 4 ఏండ్లలో రూ.వందల కోట్లు సంపాదించి తెలంగాణలోనే నెంబర్ వన్ అవినీతి ఎమ్మెల్యేగా పేరు పొందాడని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పురుమళ్ల మనోహర్, లీడర్లు బుచ్చయ్య, నర్సయ్య, సంధ్య-, రాజిరెడ్డి పాల్గొన్నారు.
ALSO READ : ఎమ్మెల్యేగా కాదు.. సేవకుడిగా పని చేశా : సండ్ర వెంకట వీరయ్య