కాంగ్రెస్​ ప్రచార రథానికి పూజలు : మేడిపల్లి సత్యం

కొండగట్టు, వెలుగు: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్రయాత్ర కొండగట్టు నుంచే మొదలవుతుందని చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌‌‌‌చార్జి మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం ఆ పార్టీ ప్రచార రథానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్తుందన్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని, బీఆర్ఎస్ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు ఆనంద రెడ్డి, నారాయణ, మనోహర్, శ్రీనివాసరెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, చంద్ర మోహన్ రెడ్డి, తిరుపతి, ముత్యం శంకర్, పాల్గొన్నారు.