
రీసెంట్ గా 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ తన ఖాతాలో మరో సూపర్ హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉంది. వరుస సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ ఉంటూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటుంది. మంగళవారం తన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేసింది. గోల్డెన్ కలర్ టాప్ మెస్మరైజ్ చేసింది. 'ఫైర్ అండ్ ఐస్' క్యాప్షన్ తో ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గోల్డెన్ బ్యూటీ, బంగారంలా మెరిసిపోతోంది అంటూ నెటిజన్లు కామెంట్లు పడుతున్నారు. ఇక ప్రస్తుతం 'అనగనగ ఒక రాజు' చిత్రంలో నవీన్ పొలిశెట్టికి జంటగా మీనాక్షి నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు చిరంజీవి 'విశ్వంభర' చిత్రంలో మీనాక్షి గెస్ట్ రోల్లో కనిపించనుంది. అలాగే పలు క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.