
టాలీవుడ్ లో అరడజనుకిపైగా సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్ కి బాగానే దగ్గరైంది ఢిల్లీ బ్యూటీ మీనాక్షి చౌదరి.. అయితే ఈ అమ్మడు మొదటగా ప్రముఖ హీరో అక్కినేని సుశాంత్ నటించిన "ఇచట వాహనములు నిలుపరాదు" అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది.. ఆతర్వాత ప్రిన్స్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, విజయ్(తమిళ్), రవితేజ, తదితర స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.. అయితే రెండు రోజులుగా మీనాక్షి చౌదరి గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఏపీ విమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ పదవికి మీనాక్షి చౌదరి ని ఎంపిక చేశారని దీంతో త్వరలోనే ఈ విషయానికి సంబందించిన అఫీషయల్ ప్రకటన కూడా రానుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
కానీ అసలు విషయం ఏమిటంటే మీనాక్షి చౌదరి ఆమధ్య ఓ ప్రమోషన్ ఈవెంట్ లో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కీలక నేతని కలిసింది. దీంతో మీనాక్షి చౌదరి ని ఏపీ విమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని ఆ నేత నిర్ణయం తీసుకున్నారట. కానీ హై కమాండ్ మాత్రం అందుకు నో చెప్పినట్లు సమాచారం. దీనికితోడు మీనాక్షి మరియు ఆ కీలక నేత కూడా చౌదరి కావడంతో అందరూ ఈ వార్త నిజమేనని అనుకున్నారు.. అయితే ఈ ఏపీ విమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా మీనాక్షి చౌదరి నియమించినట్లు వార్తలు జోరుగా వినిపిస్తుండటంతో ప్రభుత్వం స్పందిస్తూ ఇందులో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి విన్పిస్తున్న ఫేక్ న్యూస్ కి పులిస్టాప్ పడింది.
ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్. ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారమైన చర్యలు ఉంటాయి.… pic.twitter.com/96uI4Xb0Zr
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) March 2, 2025
ఈ విషయం ఇలా ఉండగా మీనాక్షి చౌదరి గత ఏడాది లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇందులో హోమ్లీ వైఫ్ పాత్రలో కనిపించింది. ఇక ఈ ఏడాది స్టార్ హీరో వెంకటేష్, ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి అలరించింది.