HBD Meenakshi Chaudhary: లక్కీ భాస్కర్ కోసం..నిండు మనసుతో ఎదురుచూసే సుమతి

సార్ సినిమాతో ధనుష్ (Danush)కు సూపర్ హిట్ అందించిన దర్శకుడు వెంకీ అంట్లూరి (Venky Atluri) డైరెక్షన్లో లక్కీ భాస్కర్ (Lucky Baskhar) మూవీ చేస్తున్నాడు దుల్కర్.ఈ మూవీలో దుల్కర్కి జోడిగా యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్గా నటిస్తుంది.

ఇవాళ (మార్చి 5) మీనాక్షీ పుట్టినరోజు సందర్బంగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ మూవీలో మీనాక్షి చౌదరి..సుమతి అనే క్యారెక్టర్ లో నటిస్తుంది. ప్రేమించిన భర్త కోసం..నిండు మనసుతో ఎదురుచూసే ఒక మధ్యతరగతి మహిళగా ఆకట్టుకుంటోంది.ఈ సినిమాతో మీనాక్షి  హిట్ అందుకోవడం కన్ఫమ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవలే లక్కీ భాస్కర్ నుంచి దుల్కర్ పోస్టర్ రిలీజయ్యింది. డబ్బు కట్టల మధ్యలో బ్యాంక్ ఉద్యోగిగా కళ్ళజోడు పెట్టుకొని, నీట్గా మధ్య పాపిడి తీసుకొని సూట్ కేసుతో నడుస్తూ ఉన్న లుక్ తెగ ఆకట్టుకుంది. ఇక లక్కీ భాస్కర్ భార్య ఎంత లక్షణంగా ఉందో అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

ALSO READ :- వీడియో: ప్రేమ పెళ్లికి నో చెప్పిన పెద్దలు.. ప్రియుడే కావాలని పట్టుబట్టిన ప్రియురాలు

సీతా రామమ్ తరువాత దుల్కర్ నుండి వస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా కావడంతో..ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు.