ఫన్ అండ్ లవింగ్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో.. మీనాక్షి చౌదరి

విజయ్, మీనాక్షి చౌదరి జంటగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన చిత్రం ‘ది గోట్‌‌‌‌’.  ఎజిఎస్ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ సంస్థ నిర్మించింది.  తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. గురువారం సినిమా విడుదల సందర్భంగా హీరోయిన్  మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘విజయ్ గారితో కలిసి నటించడం అద్భుతమైన అనుభూతి. పైగా ఆయన రాజకీయాల్లోకి వెళ్లే ముందు నటిస్తున్న చివరి చిత్రం ఇది. అలాంటి చిత్రంలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. 

దర్శకుడు వెంకట్ ప్రభు లుక్ టెస్ట్‌‌‌‌ చేసి, నన్ను ఈ పాత్రకు ఎంపిక చేశారు.  కాలేజ్‌‌‌‌కు వెళ్లే మోడ్రన్ అమ్మాయిగా ఫన్ అండ్ లవింగ్ క్యారెక్టర్ నాది.  నా పర్సనల్ లైఫ్‌‌‌‌కు దగ్గరగా ఉండే పాత్ర. కథలో చాలా ప్రాధాన్యత ఉండే క్యారెక్టర్ ఇది. స్నేహ, లైలా లాంటి సీనియర్స్‌‌‌‌తో పని చేయడం గొప్ప లెర్నింగ్ ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌. వెంకట్ ప్రభు గారి ఫిల్మ్ మేకింగ్ యూనిక్‌‌‌‌గా ఉంటుంది. చాలా సపోర్టివ్‌‌‌‌ కూడా.  కెరీర్‌‌‌‌‌‌‌‌ విషయంలో ప్రత్యేకమైన ప్లాన్ అంటూ ఏమీ లేదు.

నేను స్క్రిప్ట్‌‌‌‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. కథ నచ్చితే  ఆ తర్వాత పాత్ర గురించి చూస్తాను.  ‘లక్కీ భాస్కర్‌‌‌‌‌‌‌‌’లో మదర్‌‌‌‌‌‌‌‌గా, ‘రాకీ’లో మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తా. ఇక ‘మట్కా’లో నాది వెరీ డిఫరెంట్ అవతార్. అనిల్ రావిపూడి గారి సినిమాలో పోలీస్‌‌‌‌గా నటిస్తున్నా.  ఇవన్నీ దేనికవే స్పెషల్‌‌‌‌గా ఉండబోతున్నాయి. ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడాన్ని ఇష్టపడతాను’ అని చెప్పింది.