నా డ్రీమ్​ నెరవేరింది : మీనాక్షి చౌదరి

నా డ్రీమ్​ నెరవేరింది : మీనాక్షి చౌదరి

గత ఏడాది  సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో అలరించిన  మీనాక్షి చౌదరి..  ఈ సంక్రాంతికి కూడా ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉందని చెబుతోంది. వెంకటేష్‌‌కి జంటగా ఆమె నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం జనవరి 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి చెప్పిన విశేషాలు. 

‘‘ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్. అలాగే అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇలాంటి  స్ర్కిప్ట్‌‌లో భాగమవడం ఆనందంగా ఉంది. ఫస్ట్ టైమ్ కామెడీ జానర్‌‌‌‌లో నటించా. కాప్ రోల్‌‌లో నటించడం ఎక్సయిటింగ్‌‌గా ఉంది. అలాగే నేను చేసిన  యాక్షన్ సీక్వెన్సులను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు.  కాప్ రోల్ చేయాలనేది నా డ్రీం. లక్కీగా  కెరీర్ బిగినింగ్ లోనే రావడం సంతోషంగా ఉంది. నా పాత్ర కోసం ఎలాంటి రిఫరెన్స్ తీసుకోలేదు. మా డాడీ ఆర్మీ ఆఫీసర్ కావడంతో ఆయన బాడీ లాంగ్వేజ్‌‌పై ఐడియా ఉంది.  నేను కూడా కొంత హోం వర్క్ చేశా.  

వెంకటేష్ గారితో వర్క్ చేయడం సూపర్ ఎక్స్‌‌పీరియెన్స్. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. అనిల్, వెంకీ గారిది సూపర్ హిట్ కాంబినేషన్. సెట్‌‌లో కూడా సందడి ఉండేది. ఐశ్వర్య రాజేష్  ప్రూవ్డ్ యాక్టర్.  తను చాలా పాజిటివ్‌‌గా ఉంటుంది. ఆమె నుంచి చాలా మెళకువలు నేర్చుకున్నా.  అనిల్ గారి కామెడీ టైమింగ్ ఫెంటాస్టిక్. కామెడీ తీయడం అంత ఈజీ కాదు. సీన్ బెటర్ చేయడంలో అనిల్ గారి ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయనతో పాటు దిల్ రాజు గారి ప్రొడక్షన్‌‌లో  వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌‌పీరియెన్స్. ఇప్పటికే వచ్చిన సాంగ్స్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ALSO READ : రొమాంటిక్ యాక్షన్ దిల్ రూబా టీజర్

సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నా.  గతేడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’, ఇప్పుడు ఈ సినిమా వస్తోంది.  ఇలా తెలుగు వారి పెద్ద పండుగ రోజున నా సినిమాలు రిలీజ్ అవ్వడం గ్రేట్‌‌ఫుల్‌‌గా ఉంది. ఈ జర్నీ ఒక డ్రీమ్‌‌లా ఉంది. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో ‘అనగనగా ఒకరాజు’ చిత్రంలో నటిస్తున్నా".