నెల రోజుల వ్యవధిలో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తుండడం సంతోషంగా ఉందంటోంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. దీపావళికి ‘లక్కీ భాస్కర్’తో సూపర్ హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి.. రెండు వారాల గ్యాప్‌తో ‘మట్కా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇదే నెలలో ‘మెకానిక్ రాకీ’ కూడా రిలీజ్ కానుంది. గురువారం ‘మట్కా’ సినిమా విడుదల సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘హీరో వరుణ్ తేజ్‌కు జంటగా సుజాత అనే పాత్రలో కనిపిస్తా. వరుణ్ పోషిస్తున్న వాసు పాత్రతో కలిసి ట్రావెల్ అయ్యే పాత్ర. తన జీవితంలో ఒక వెలుగు లాంటి పాజిటివ్ క్యారెక్టర్. అందరూ రిలేట్ చేసుకుంటారు. టీనేజ్‌లో మొదలై మూడు డిఫరెంట్ ఫేజుల్లో ఉంటుంది.
దర్శకుడు కరుణ కుమార్ పర్టిక్యులర్‌గా స్కెచెస్ వేసి, ఈ క్యారెక్టర్ లుక్‌ని డిజైన్ చేశారు. చాలా ఎక్సయిటింగ్ ట్రాన్స్ఫర్మేషన్. పీరియాడిక్ డ్రామా కనుక అప్పటి బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్‌గా ఉంటుంది. నేను ఇప్పటివరకూ చేసిన క్యారెక్టర్స్‌లో డిఫరెంట్ లుక్ ఉన్న సినిమా ఇదే. నాకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చింది. చాలా ఎంజాయ్ చేశాను. వరుణ్ తేజ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సెట్లో చాలా హెల్ప్ చేశారు. నిర్మాతలు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఎంతో ప్యాషన్ తో ఈ సినిమా నిర్మించారు. తప్పకుండా సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పింది.