![తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్](https://static.v6velugu.com/uploads/2025/02/meenakshi-natarajan-is-the-new-in-charge-of-telangana-congress_lFYZzXPsyq.jpg)
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. ప్రస్తుత ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ 2025, ఫిబ్రవరి 14న ఆదేశాలు జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు పలు కేంద్ర పాలిత ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలకు ఇంచార్జులు, ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నియమాకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తెలంగాణతో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, 9 రాష్ట్రాలకు ఇంచార్జులు, కార్యదర్శులను నియమించింది ఏఐసీసీ. మరికొన్ని రోజుల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ హై కమాండ్ రాష్ట్ర ఇంచార్జ్‌ను మార్చడం గమనార్హం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా నియమితులైన మీనాక్షి నటరాజన్.. 2009లో మధ్యప్రదేశ్లోని మాండసోర్ నుంచి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ లో కింది స్థాయి నుంచి ఎదిగిన నాయకురాలిగా మీనాక్షి నటరాజన్ కు మంచి పేరుంది. ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీమ్‌లో కీలక సభ్యురాలిగా ఉన్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండే నేతను తెలంగాణ ఇంచార్జ్ గా నియమించడం గమనార్హం.
9 రాష్ట్రాల కొత్త ఇంచార్జులు:
- హిమాచల్ ప్రదేశ్, ఛండీఘర్ ఇంచార్జ్: రజనీ పాటిల్
- హర్యానా: బీకే హరిప్రసాద్
- మధ్యప్రదేశ్: హరీష్ చౌదరి
- తమిళనాడు, పాండిచ్చేరి: గిరీశ్ చోడాంకర్
- ఒడిషా: అజయ్ కుమార్ లల్లూ
- జార్ఖండ్: కే రాజు
- మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్: సప్తగిరి శంకర్ ఉల్కా
- బీహార్: కృష్ణ అల్లవారు
- తెలంగాణ: మీనాక్షి నటరాజన్
కొత్త జనరల్ సెక్రటరీలు:
- పంజాబ్: భూపేష్ భగల్
- జమ్మూ కాశ్మీర్, లడక్: సయ్యద్ నాసీర్ హుస్సేన్