23న గాంధీ భవన్​లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం

23న గాంధీ భవన్​లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం
  • తొలిసారి రాష్ట్రానికి రానున్న పార్టీ ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్

హైదరాబాద్, వెలుగు: పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఈ నెల 23న ఉదయం 11 గంటలకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్య క్షతన గాంధీ భవన్​లో జరగనుంది. ఈ మీటింగ్​కు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​గా ఇటీవలే నియమితులైన మీనాక్షి నటరాజన్ హాజరుకానుండడం తో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథన్​ చీఫ్ గెస్టులుగా అటెండ్ కానున్నారు. 

సమావేశంలో పార్టీ ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్య క్షులు, పీఏసీ, పీఈసీ సభ్యులు, పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరే షన్ చైర్మన్లు, అధికార ప్రతినిధులు పాల్గొంటారని పీసీసీ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నేతలంతా రాష్ట్ర, జాతీయ రాజకీయా లు, రానున్న లోకల్ బాడీ ఎన్నికలు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.