
మీరా జాస్మిన్‌కు తెలుగులో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇరవై ఏళ్ల క్రితం టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమై తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆమె.. తిరిగి రీ ఎంట్రీ ఇస్తోంది. శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శ్వాగ్’ చిత్రంలో మీరా జాస్మిన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులోని ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఆదివారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘ఉత్ఫల దేవి’గా తన క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాణి గెటప్‌లో ఇంప్రెస్ చేస్తోంది మీరా జాస్మిన్. ‘‘శ్వాగ్’ ప్రపంచంలోకి అడుగుపెట్టినందుకు గౌరవంగా ఉంది. తిరిగి తెలుగు సినిమాల్లోకి రావడానికి గర్వపడుతున్నా’ అని ఆమె సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసింది. ఇక ఈ చిత్రంలో వింజమర వంశం క్వీన్ రుక్మిణి దేవిగా రీతూ వర్మ ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.