Meera Jasmine: యంగ్ హీరోతో రీ-ఎంట్రీ.. తెలుగు సినిమాలో మీరా జాస్మిన్

Meera Jasmine: యంగ్ హీరోతో రీ-ఎంట్రీ.. తెలుగు సినిమాలో మీరా జాస్మిన్

మీరా జాస్మిన్.. తెలుగు ఆడియన్స్ ఈపేరును అంత తొందరగా మర్చిపోలేరు. ఎందుకంటే ఆమె తన సినిమాతో తెలుగు ఆడియన్స్ అంత దగ్గరైపోయారు. అమ్మాయి బాగుంది సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తరువాత వరుసగా భద్ర, గోరింటాకు, గుడుంబా శంకర్ వంటి సినిమాల్లో నటించింది. ఆతరువాత కొంతకాలానికి పెళ్లిచేసుకొని సినిమాలకు దూరమయ్యారు మీరా జాస్మిన్. ఆమె చివరగా తెలుగులో కనిపించిన మూవీ విమానం. ఈ సినిమాతో మళ్ళీ తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు ఆమె. 

తాజాగా ఆమె నటిస్తున్న మరో తెలుగు సినిమా నుండి అప్డేట్ వచ్చేసింది. శ్రీవిష్ణు హీరోగా స్వాగ్ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. హసిత్ గోలి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో మీరా జాస్మిన్ కూడా కీ రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. మహారాణిలా ఉన్న మీరా జాస్మిన్ లుక్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ప్రస్తుతం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక స్వాగ్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల లాంఛనంగా మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబోలో ఇప్పటికే రాజ రాజ చోర అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అందుకే ఈ కాబోలో వస్తున్న స్వాగ్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.